ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.కస్టమర్ ల కోసం వివిధ రకాల ఈ – కామర్స్ సైట్లు కూడా ఉన్నాయి.
ఇందులో ఎప్పటికప్పుడు ఆఫర్స్ ప్రకటించడం, కస్టమర్ ను ఆకట్టుకోవడానికి కోసం సరికొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి ఈ – కామర్స్ సంస్థలు అయితే ఇందులో ముందంజలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా న్యూయార్క్ కు చెందిన ఒక మహిళకు ఆమె ఎటువంటి ఆర్డర్ చేయకపోయినా వందలకొద్దీ డెలివరీ బాక్సులు ఆమె ఇంటి వద్దకు వచ్చాయి అమెజాన్ నుంచి.
ముందుగా ఇలా డెలివరీ బాక్సులు రావడం చూసి ఆమె ఎవరైనా సప్రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా ఇదేమైనా స్కాంలో భాగమని ఆలోచించాలట ఆ విషయంపై క్లారిటీ కోసం అమెజాన్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి వివరాలను తెలిపింది.అలాగే పొరపాటున నా అడ్రస్ కు వచ్చామో అని అవి తాను రిటన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలియజేసింది అయితే అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అధికారికంగానే ఆ పార్సెల్ మీవే అని చెప్పి వెనక్కి తీసుకోమని మరి అన్నీ కూడా ఇంటికి పంపించారు.
ఇక ఆ మహిళ నిజానికి ఆ డెలివరీ బాక్స్ లో ఏముందో అని తెలుసుకోవడానికి అవి ఓపెన్ చేసి చూడగా అందులో సిలికాన్ సంబంధిత ఫ్రేములు ఉన్నాయి.అయితే వాస్తవానికి ఆ పదార్థం ఫేస్ మాస్క్ లలో ఉపయోగించే పదార్థం అని కన్ఫామ్ చేసుకుంది.
అయినప్పటికీ కూడా పార్సల్ రావడం మాత్రం మానలేదు.అంతేకాకుండా వాటిపై నో రిటర్న్ అని కూడా రాసి ఉంది చివరికి ఆ బాక్స్ లపై ఉండే బార్ కోడ్లు, ట్రాకింగ్ నెంబర్లు వివరాల గురించి వెతకడం మొదలు పెట్టింది.

ఇక ఈ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ ముందుగా ఇదేదో స్కాన్ అనుకున్నానన వారి దగ్గర ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నారని భావించానని ఎందుకంటే ఐటెంలన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి అంటూ చెప్పుకొచ్చింది.ఆ మహిళకు అమెజాన్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఆర్డర్ గురించి వివరించగా ఊరికే వస్తున్నప్పటికీ ఆ పార్సెల్ తీసుకున్న ఎటువంటి ప్రయోజనం లేదని తెలుసుకోవడంతో ఇదంతా తెలియడంతో అమెజాన్ అసలు ఓనర్ ను ట్రాక్ చేయడం మొదలు పెట్టేసింది.దీంతో అసలు నిజం బయటకు వచ్చింది అది ఏమిటి అంటే లోకల్ చిల్డ్రన్ హాస్పిటల్ లో చిన్నారుల కోసం డీఐవై మాస్కులు చేయడం కోసం వాటిని ఆర్డర్ చేసినట్లు తెలుసుకుంది.ఇక చివరికి ఆ మహిళ డెలివర్ బాక్స్ లతో పాటు ట్రాన్సిట్ లో ఉన్న వాటిని కూడా అసలు ఓనర్ కు అప్పగించింది.