మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విధ్వంసానికి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రజలను ఇంటికే పరిమితం చేసే తరహాలో లాక్డౌన్ అదేవిధంగా కర్ఫ్యూను అమలు చేస్తూ కరోనా కట్టడి చేయటానికి కేంద్రం కీలక నిర్ణయాలు స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరిగింది.
ఇటువంటి తరుణంలో ప్రజలు అంత ఇళ్లకే పరిమితం కావడంతో.ఉపాధి లేక చేతి పనులు చేయడానికి వీలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో మే జూన్ నెల వరకు కరోనా కారణంగా ఉచిత రేషన్ కేంద్రం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే నిన్న కేంద్ర క్యాబినెట్ బేటీ జరిగిన క్రమంలో మరో ఐదు నెలల పాటు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.బియ్యం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున బియ్యం అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.దేశంలో సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న గాని మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.