సూపర్ స్టార్ మహేష్ బాబు మాటను ఫ్యాన్స్ వేదంగా భావిస్తారనే సంగతి తెలిసిందే.చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశంలో మూడున్నర లక్షలకు అటూఇటుగా కేసులు నమోదవుతుండగా 2,000కు పైగా మరణాలు నమోదవుతున్నాయి.వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ్ వేగంగా జరుగుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
మరోవైపు మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్నవాళ్లకు సైతం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది.అయితే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా నుంచి ఎవరైతే కోలుకుంటారో వారు ప్లాస్మాను డొనేట్ చేయాలని సూచనలు చేశారు.
సజ్జనార్ చేసిన ట్వీట్ ను మహేష్ బాబు రీట్వీట్ చేయడంతో పాటు ప్లాస్మాను డొనేట్ చేయాలని కోరారు.
అభిమానులకు ప్లాస్మా డొనేట్ చేయాలని పిలుపునివ్వడంతో పాటు కరోనాతో పోరాడుతున్న వాళ్లకు మన వంతు సహాయం చేద్దామని అన్నారు.గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో డోనర్స్ అవసరమని మహేష్ బాబు తెలిపారు.మరోవైపు మహేష్ బాబు వ్యక్తిగత స్టైలిష్ట్ కు కరోనా సోకడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
మహేష్ కరోనా పరీక్ష చేయించుకోగా పరీక్షలో నెగిటివ్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ప్రస్తుతం నటిస్తుండగా తరువాత సినిమాకు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.
మహేష్ తరువాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తారో లేక మరో డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తారో చూడాల్సి ఉంది.
మహేష్ సినిమాలకు సంబంధించి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.