కరోనా వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం.. !

తెలంగాణ ప్రజలకు అందించే కరోనా వ్యాక్సిన్ పై ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లు అయింది.ఇప్పటి వరకు వ్యాక్సిన్‌కు డబ్బులు చెల్లించాలా, లేదా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా అని తర్జబర్జనలు పడుతున్న వారికి ఇదొక తీపి కబురులా తోస్తుంది.

 Telangana Government Makes Key Statement On Corona Vaccination, Telanga Govt, Co-TeluguStop.com

ఇంతకు విషయం ఏంటంటే.గత రెండు రోజుల క్రితం కేంద్రం వ్యాక్సిన్ల రేటు ప్రకటించగా ఆ ధరలలో ఉన్న వ్యత్యాసం పై నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ నేపధ్యంలో పలువురు రాజకీయ నేతలు విమర్శలు కూడా చేసారు.మరి తెరవెనక జరిగిన రాజకీయం ఏంటో గానీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తామని, తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఇదిలా ఉండగా నిన్న ఏపీ ప్రభుత్వం కూడా 18 సంవత్సరాలు నిండిన వారితో పాటుగా 45 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.మరి ఏపీలో ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్‌కు తెలంగాణలో డబ్బులు వసూలు చేస్తే ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉండటంతో ఇక్కడి ప్రభుత్వం సుమారుగా రూ.2,500 కోట్ల భారం భరించుకుంటూ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. మరి ఈ భారాన్ని కేంద్రం భరిస్తుందా, రాష్ట్రం భరిస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube