పెళ్లికి ముందే శృంగారం.. అంజలి సంచలన వ్యాఖ్యలు..?

తమిళంలో నటిగా మంచి గుర్తింపునే సంపాదించుకున్నా తెలుగులో మాత్రం అంజలి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా అంజలికి అదృష్టం కలిసిరాలేదు.

 Heroine Anjali Interesting Comments About Vakeel Saab Promotions, Heroine Anjali-TeluguStop.com

ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటించగా ఆ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అంజలి వేర్వేరు విషయాల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోల పాత్రలకు తప్ప మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని కానీ వకీల్ సాబ్ సినిమాలో మాత్రం దర్శకుడు కథ ఎలా చెప్పారో అదే విధంగా తెరకెక్కించారని అంజలి తెలిపారు.వకీల్ సాబ్ మూవీని తాను రెండుసార్లు చూశానని సినిమా స్టోరీలోని ఆత్మ మిస్ కాకుండా తెలుగు నేటివిటీకి తగిన విధంగా కథలో మార్పులు చేశారని అంజలి పేర్కొన్నారు.

Telugu Anjali, April, Pawan Kalyan, Bee, Vakeel Saab, Vakeelsaab-Movie

రోజూ పేపర్లలో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలకు సంబంధించిన వార్తలను మనం చూస్తుంటామని చాలా సందర్భాల్లో ఈ వార్తలను పెద్దగా పట్టించుకోమని అంజలి అన్నారు.కానీ ఇలాంటి ఘటనల వల్ల జీవితాలే మారిపోతాయని అంజలి పేర్కొన్నారు.పెళ్లికి ముందే శృంగారం గురించి అంజలి మాట్లాడుతూ అది వ్యక్తిగతం అని అన్నారు.ఆ విషయంలో ఇతరులు ఆలోచించే విధానాననికి తను ఆలోచించే విధానానికి తేడా ఉంటుందని అంజలి తెలిపారు.

సమాజంలో ఆడపిల్లల అభిప్రాయాలకు, నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలని.ఆడపిల్లలకు ఉండే హక్కులను కాలరాయకూడదని ఆమె పేర్కొన్నారు.

వకీల్ సాబ్ సినిమాతో అంజలి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube