ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులను అనుమతించాలి అనే విషయంపై ఇండియన్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తోందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పారు.ఐపీఎల్ 2021 సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఏప్రిల్ లేదా మే నెలలో జరగనుందని సమాచారం.
ఇక ఐపీఎల్ మినీ వేలంపాట ఫిబ్రవరి 18 అనగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభం కానున్నది.ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు.
ఈ వేలంపాట చిన్నదే కానీ అన్ని టీమ్స్ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాయి అందుకే అవన్నీ కూడా చాలా వర్క్ చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను.కరోనా సమయంలోనూ అక్టోబర్, నవంబర్ నెలలలో దుబాయ్ లో ఐపీఎల్ సీజన్ జరగడం నిజంగా నమ్మశక్యంగా ఉంది.
పోయినసారి సీజన్ కి మంచి రేటింగ్స్ వచ్చాయి.ఈ సంవత్సరం ఐపీఎల్ కి ఇంకా ఎక్కువగా రేటింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
అలాగే మేము అభిమానులను స్టేడియంలోకి అనుమతించడానికి వీలు ఉందా లేదా అనే అంశంపై కూడా ఆలోచిస్తున్నాము.ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం త్వరలోనే తీసుకోవాల్సి ఉంది’ అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు.

వాస్తవానికి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కే అభిమానులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది.కానీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ స్వదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయిన తర్వాత రెండో టెస్ట్ మ్యాచ్ కి అభిమానులను అలో చేయాలని బీసీసీఐ తో చెప్పింది.దీంతో బీసీసీఐ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాటకు గౌరవం ఇచ్చి ఫస్ట్ టెస్ట్ కి అభిమానులను అనుమతించలేదు.కానీ ఇంగ్లాండ్, భారత్ రెండో టెస్ట్ కి మాత్రం అభిమానుల ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఒక ఏడాది తర్వాత మొదటిసారిగా అభిమానులు క్రికెట్ మ్యాచ్ ని స్టేడియం లో కూర్చొని వీక్షించగలిగారు.