కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు గత కొన్ని నెలల నుండి దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ ర్యాలీ అంటూ కొంతమంది దుండగులు రైతు సంఘాలు చేస్తున్న నిరసనలు అక్రమంగా చొరబడి పోలీసులను రేచ్చగోట్టడమే కాక వారిపై దాడికి పాల్పడటం తో పాటు ఎర్రకోటపై జెండా ఎగరవేయడం జరిగింది.
దీంతో రైతులు చేస్తున్న ఆందోళనలు నిరసనలు తమకంగా మారటంతో కేంద్రం రిపబ్లిక్ డే నాడు దాడులకు పాల్పడిన వారిపై కేసులు పెట్టడం జరిగింది.దీంతో ఇప్పుడు పరిస్థితి మరింత ఉదృతంగా మారటమే కాక, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ బాట పట్టడంతో ఢిల్లీ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం.
ఈ మేరకు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద ఆదివారం రాత్రి 11 గంటల వరకు.ఇంటర్నెట్ ఫోన్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.