తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఏంటంటే.కేసీఆర్ త్వరలో తన రాజకీయ వారసునిగా కేటీఆర్ ను ప్రకటిస్తాడనే వార్త అటం బాంబులా పేలుతుంది.
ఇక టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయంటు మీడియా ముందు వెల్లడిస్తున్నారు.
ఈ నేపధ్యంలో కేటీఆర్ నేడో రేపో సీఎం అవుతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో, తెలంగాణ ప్రజల్లో జోరుగా సాగుతోంది.
అయితే ఇక్కడే ఊహించని సంఘటన చోటు చేసుకుంది.తాజాగా కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు పర్సనల్‌గా ఫోన్ చేసి మరీ తన గురించి మాట్లాడవద్దని, అది బహిరంగంగా అసలే వద్దని విన్నవించడం సరికొత్త చర్చకు దారి తీసింది.
మొత్తంగా కేటీఆర్ తమతో ఇలా అనడంలో ఉన్న మర్మం అర్ధం కాక ఆ పార్టీ వర్గాల్లో కొంత అయోమయం నెలకొందట.ఇక కేటీఆర్ సీఎం అయ్యేందుకు పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న క్రమంలో ఆయన ఫోన్ కాల్ కొత్త సంకేతాలను అందించిందని ఆలోచించే వారు కూడా ఉన్నారట.