టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై వైసీపీ మంత్రి విజయ్ సాయి రెడ్డి, విజయనగరం రామతీర్థం ఆలయంలో కోదండ రాముడి విగ్రహా ద్వంసంలో వారి హస్తం ఉందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ సింహాచలం అప్పన సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి నేను సిద్దం.
మీ నాయకుడు జగన్ సిద్దామా అంటూ విజయ్ సాయి రెడ్డికి సవాల్ విసిరాడు.

విజయ్ సాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అన్నాడు.జగన్, విజయ్ సాయి రెడ్డి వెనకాల ఉండి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నాడని ఆయన ట్వీట్ చేశాడు.వైసీపీ, దొంగల బ్యాచ్ తో కలిసి ఇలాంటి ఘటనలు జగన్ చేయిస్తున్నాడని గతంలో గతంలో వైసీపీ పార్టీ టీటీడీ అధికారి ధర్మారెడ్డితో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పింక్ డైమండ్ విషయమై చంద్రబాబు ఇంట్లో ఉందని అసత్య ప్రచారం చేయించాడు.
ఇప్పుడు ఆ పింక్ డైమండ్ కనిపించడంలేదని చెప్పడంతో అసలు దొంగలు ఎవరో తెలిసిందని అన్నాడు.జగన్ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి మోసపూరితమైన హామీలను ఇస్తున్నాడని నారా లోకేష్ అన్నాడు.
