తెలుగు స్టార్ నిర్మాత దిల్ రాజు ఇటీవల తన 50వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే.టాలీవుడ్ కు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
స్టార్స్ కుటుంబ సమేతంగా హాజరు అయిన ఈ బర్త్ డే వేడుకలో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇంకా ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక దిల్ రాజు కూడా ఈ వేడుకలో చాలా ప్రత్యేకంగా కనిపించారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న ఆయన తన భార్యతో కలిసి ఫొటోలకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ లో ఉన్నాడు.
వరుసగా ఈయన నిర్మిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.ఇక ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.
ఇదే సమయంలో ఆయన గోవాలో తన ముఖ్య మైన వారికి కూడా పార్టీ ఇస్తున్నారు.
![Telugu Dil Raju, Dr, Goa, Pawan Kalyan, Telugu, Tollywood-Movie Telugu Dil Raju, Dr, Goa, Pawan Kalyan, Telugu, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2020/12/dil-raju-dr50-birthday-party-in-goa-Dill-Raju-Goa-Tour-Mahesh-Babu-Pawan-Kalyan-Chiranjeevi-Prabhas-hero-Ram.jpg)
గోవాలో ప్రస్తుతం శర్వానంద్, సిద్దార్థతో పాటు ఇంకా పలువురు ప్రముఖ యంగ్ స్టార్స్ తో కలిసి దిల్ రాజు తన బర్త్ డే పార్టీలో ఉన్నాడు.రెండు మూడు రోజుల పాటు గోవా టూర్ లో ఈయన ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం గోవాలో పార్టీలో యంగ్ స్టార్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్ లో పార్టీని మిస్ అయిన వారు కొందరు మరియు ఇక్కడ హాజరు అయిన వారు కూడా కొందరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.తన స్టాఫ్ అందరిని కూడా ప్రత్యేకంగా గోవాకు దిల్ రాజు పంపించాడు.
అక్కడ వారికి పార్టీ ఏర్పాటు చేశాడు.మొత్తానికి దిల్ రాజు తన హాఫ్ సెంచరీ బర్త్ డే పార్టీలను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నాలుగు సినిమాలు ఉన్నాయి.ఆ సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
దిల్ రాజు ఈ ఏడాది లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి సమయంలో ఎవరిని కూడా ఆహ్వానించలేక పోయాడు.
అందుకే ఇలా బర్త్ డే పార్టీని వైభవంగా చేశాడనేది టాక్.