గూగుల్ పే కు పోటీ కాబోతున్న జియో పే...?

రిలయన్స్ ఇండస్ట్రీస్… ఇప్పుడు ప్రపంచంలో టాప్ 100 ఫార్చ్యూన్ కంపెనీస్ లో ఒకటి గా పేరుపొందిన కంపెనీ.భారతదేశంలో వివిధ రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకెళ్తోంది.

 Jio Phone Users To Get Jio Pay Appm Jio Pay, Reliance Industries, Google Pay, Ph-TeluguStop.com

ఇకపోతే తాజాగా రిలయన్స్ జియో దేశంలోని టెలికాం ప్రపంచాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది అని చెప్పవచ్చు.తాజాగా మరో ఫీచర్ ను అందివ్వడానికి రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళితే.రిలయన్స్ జియో తమ జియో ఫోన్ ఉపయోగించే వారికి ఇకపై జియో ఫోన్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా సరికొత్త ఫీచర్లతో తీసుకురానుంది.

ఇందుకు జియో కొత్తగా జియో పే అనే యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.అయితే ఇప్పటికే రిలయన్స్ జియో సంస్థ తన జియో కస్టమర్ లో కొంత మందిని ఎంపిక చేసి వారి జియో ఫోన్ ద్వారా టెస్టింగ్ లను కూడా నిర్వహిస్తోంది.

దీంతో అతి త్వరలోనే ఈ పేమెంట్ యాప్ ను జియో ఫోన్లో వారి యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

Telugu Google Pay, Jio Pay, Jiophone, Transfer, Phone Pay, Reliance-

ఇక ఈ విధానం ద్వారా జియో వినియోగదారులు నగదును మరొకరికి పంపించవచ్చు.ఈ అద్భుతమైన ఫీచర్ కోసం జియో సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంకు తో ఒప్పందం చేసుకుంది.అంతేకాకుండా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ బ్యాంకులు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకులతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ ఆప్షన్ కేవలం జియో ఫోన్ యూజ్ చేసే వారికి మాత్రమే అందుబాటులోకి వస్తుందని, వచ్చే ఏడాది స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి వ్యక్తికి అందుబాటులోకి తీసుక వచ్చేందుకు రిలయన్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.ఇక ప్రస్తుతానికి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి మనం ఉపయోగిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే లాంటి అప్లికేషన్స్ కు పోటీగా జియో సంస్థ విడుదల చేయబోయే జియో పే కచ్చితంగా పోటీ ఇస్తుందని అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube