నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు చిత్ర యూనిట్.
అయితే కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఈ సినిమాలో బాలయ్య మాస్ లుక్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.
కాగా ఈ సినిమా టీజర్‌ను బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.ఈ టీజర్‌లో బాలయ్యను చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు దర్శకుడు బోయపాటి.
కాగా ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండేలా చిత్ర దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను ఈ సినిమాలో విలన్‌గా నటించాల్సిందిగా చిత్ర యూనిట్ గతంలోనే ఆయన్ను కోరారు.
కానీ ఆయన ఈ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడట.
అయితే పట్టువదలని బాలయ్య, ఈ సినిమాలో ఎలాగైనా సంజయ్ దత్ నటిస్తే బాగుంటుందని తెలపడంతో బోయపాటి సంజయ్ దత్‌ను ఈ సినిమాలో నటించేలా ఒప్పించాడట.
దీంతో ఈ సినిమాలో సంజయ్ దత్ బాలయ్యను ఢీకొట్టే సన్నివేశాలు ఎలా ఉండనున్నాయా అనే సందేహం సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో ముంబైకి చెందిన ఓ కొత్త బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.