అందాల భామ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పెంగ్విన్’ ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయగా, ఒక్కోచోట ఒక్కో ఫలితాన్ని దక్కించుకుంది.
అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాకు పెద్ద ఆదరణ దక్కలేదు.దీంతో చిత్ర నిర్మాతలకు నష్టాలు మాత్రమే మిగిలాయి.
ఇక ఈ సినిమా సాధించిన రిజల్ట్‌తో ఇప్పుడు కీర్తి సురేష్ ఆలోచనలో పడింది.
ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది.
ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.
అయితే ఇప్పటికే పెంగ్విన్ చిత్రం ఓటీటీలో రిలీజ్ కావడంతో మిస్ ఇండియా చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ చిత్ర నిర్మాత మహేష్ కోనేరుకు అదిరిపోయే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర నిర్మాత మహేష్ కోనేరు అంటున్నారు.ఏది ఏమైనా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ఆయన అంటున్నారు.
దీంతో మిస్ ఇండియా చిత్ర ఓటీటీ రిలీజ్ వార్తలకు చెక్ పడింది.ఇక ఈ సినిమాను నాగేంద్ర నాథ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ డ్రామా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.