స్టార్ హీరోలను పక్కనబెట్టిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా చిరు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలవడంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిసింది.

 Surender Reddy Next Movie With Ram, Surender Reddy, Ram Charan, Sye Raa, Ram Pot-TeluguStop.com

అయితే ఈ సినిమాతో సురేందర్ రెడ్డికి వరుసబెట్టి ఆఫర్లు వచ్చి పడతాయని అందరూ అనుకున్నారు.కానీ అలా జరగలేదు.

సురేందర్ రెడ్డి తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించేందుకు చాలా కష్టపడుతున్నాడు.

ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చేయాలని చాలానే ప్రయత్నించాడు.

కానీ రామ్ చరణ్ సురేందర్ రెడ్డిని మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందిగా కోరడంతో విసిగిపోయిన ఆయన, తన నెక్ట్స్ సినిమాలో స్టార్ హీరో ప్లేస్‌లో మీడియం రేంజ్ హీరోను తీసుకోవాలని చూస్తున్నాడు.ఈ క్రమంలో సురేందర్ రెడ్డి తన నెక్ట్స్ మూవీని హీరో రామ్ పోతినేనితో చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రామ్ పోతినేనికి ఓ అదిరిపోయే స్క్రిప్టును వినిపించిన సురేందర్ రెడ్డి, ఈ సినిమాలో రామ్‌ను నటించేలా ఒప్పించినట్లు తెలుస్తోంది.మొత్తానికి సురేందర్ రెడ్డి తన కొత్త చిత్రానికి హీరోను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి, వెంటనే షూటింగ్ కూడా ప్రారంభించాలని సురేందర్ రెడ్డి చూస్తున్నాడు.కాగా రామ్ ప్రస్తుతం రెడ్ అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube