సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో ఒక్కసారిగా వారసత్వం, వారసత్వం వ్యతిరేకించే వారు అంటూ రెండు వర్గాలుగా విడిపోయారు.సుశాంత్ మరణాన్ని అడ్డుపెట్టుకొని చాలా కొంత మంది దర్శకులు, నటులు బయటకి వచ్చి ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు, వారసత్వ పెత్తనంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు.
మరో వైపు వారసత్వాన్ని సమర్ధించేవారు కూడా ఉన్నారు.ఏది ఏమైనా బాలీవుడ్ లో మాత్రం సుశాంత్ మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం దిల్ బేచారా మే నెలలో రిలీజ్ కావాల్సింది.అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిపోయింది.
అయితే ఇప్పుడు సుశాంత్ మరణాన్ని క్యాష్ చేసుకోవడానికి ఒటీటీ సంస్థలు పోటీ పడుతూ అతని సినిమా రైట్స్ కోసం భారీగా ఆఫర్ చేస్తున్నారు.
ముఖేష్ ఛబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు నిర్మించారు.
ఈ సినిమా ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే నవల ఆధారంగా రూపొందింది.సుశాంత్ తో పాటు సంజన సాంఘి సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ సింగ్ క్యాన్సర్ పేషెంట్ గా కనిపిస్తాడట.
ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఇక సినిమాకి భారీ ఆఫర్స్ రావడంతో నిర్మాతలు కొంత ఒటీటీ రిలీజ్ కోసం కొంత సానుకూలంగా స్పందించారు.
అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా ఓటీటీలో రిలీజ్ చేయొద్దు.థియేటర్స్ లో విడుదల చేయండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.
ఏ ఆర్ రెహమాన్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.మరి దీనిపై నిర్మాతల నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి.