బాలీవుడ్ లో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ప్రకంపనలకి కారణం అయ్యింది.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇందాస్త్రీలోకి వచ్చేవారిని అణచివేస్తున్నారని, అవకాశాలు లేకుండా చేస్తున్నారని విమర్శలు చేసే వారు ఎక్కువ మంది అయిపోయారు.
చాలా మంది నేరుగా ఇండస్ట్రీలో వారసత్వ నటులని పరిచయం చేస్తున్న కరణ్ జోహార్ ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు.అతను ఇండస్ట్రీలో నెపోటిజంని పెంచి పోషిస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కరణ్ జోహార్ ఎవరిని కూడా తిరిగి విమర్శించలేదు.ఇలాంటి సమయంలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కరణ్ జోహార్ కి అండగా నిలబడ్డాడు.
బాలీవుడ్ లో నెపోటిజంపై సినీ ప్రముఖులు చేస్తున్న విమర్శలపై, దీని మధ్యలోకి కరణ్ జోహార్ ని లాగడంపై వర్మ ట్విట్టర్ లో స్పందించారు.జరిగిన దానికి కరణ్ జొహార్ ను విమర్శించడం హాస్యాస్పదం.
సినీ పరిశ్రమ ఎలా నడుస్తుందో తెలియక విమర్శిస్తున్నారు.సుశాంత్ తో ఇబ్బంది ఉన్నప్పుడు అతనితో పని చేయాలా, వద్దా అనేది కరణ్ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఎవరితో కలిసి పని చేయాలనేది ప్రతి నిర్మాత సొంత నిర్ణయం.డబ్బు, పేరు వచ్చిన 12 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి వెలుపలి వ్యక్తిగా సుశాంత్ ఫీల్ అయి సూసైడ్ చేసుకున్నాడని అనుకున్నట్టైతే, సుశాంత్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన వ్యక్తులు రోజుకు కనీసం 100 మంది తనువు చాలించాలి.
నీకున్న దానితో నీవు సంతోషంగా లేనప్పుడు, నీకు ఎంత ఉన్నప్పటికీ సంతోషంగా ఉండలేవు.అన్ని రంగాలలో కుటుంబాలు తమ సొంత వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు, బాలీవుడ్ కుటుంబాలు కూడా వారి సొంత వ్యక్తులకు అదే ప్రాధాన్యతను ఇచ్చాయి.
బంధుప్రీతి ప్రతి చోట ఉంది అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.