కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి ఒక తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే ఎప్పుడూ విభిన్న కథనాలను ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేయడంలో హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు.
ఇందువల్లనే తన సినీ కెరీర్లో మంచి సక్సెస్ రేటు సాధించాడు.అంతేగాక టాలీవుడ్లో కూడా సూర్య సినిమాలకి మంచి డిమాండ్, మార్కెట్ వుంది.
అయితే ప్రస్తుతం సూర్య తమిళ ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో సూర్య సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి.కానీ ఈ చిత్రానికి సంబంధించినటువంటి రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నెలలో మొదలు పెట్టనున్నారు.
/br>
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చిత్ర పరిశ్రమలోని దాదాపుగా అన్ని చిత్రాల షూటింగులో వాయిదా పడ్డాయి.దీంతో ఆర్టిస్టులు అందరూ తాము ప్రస్తుతం నటిస్తున్న ఇటువంటి చిత్రాలను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు.
అందువల్ల ప్రస్తుతం సూర్య చిత్రానికి అవసరమైనటువంటి ఆర్టిస్టుల డేట్లు దొరకడం లేదట.
దీంతో దర్శకుడు మరియు హీరో సూర్య ఈ చిత్రాన్ని కొంత కాలం పాటు వాయిదా వేసి సమస్య సర్దుమణిగిన తరువాత మొదలు పెట్టాలని యోచనలో ఉన్నట్లు సమచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే సూర్య “ఆకాశం నీ హద్దురా” అనే చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పనులు కూడా పూర్తి చేశాడు.అయితే ఈ చిత్రం కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం విడుదలను కొంతకాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు.