మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ క్రాక్‌ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెడుతున్నాడు.
రవితేజకు వీర లాంటి హిట్ అందించిన రవివర్మ డైరెక్షన్‌లో ఓ సినిమాను ఓకే చేశాడు.ఈ సినిమా ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు పక్కా స్క్రిప్టును రెడీ చేశాడట డైరెక్టర్.
అయితే ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేయనున్నాడని, అందులో ఒకటి మాస్‌గా ఉండే సీఏ రోల్ కాగా మరొకటి క్లాస్‌గా ఉండే ఎన్నారై రోల్ అని తెలుస్తోంది.దీంతో ఈ సినిమా కథ ఇలా ఉంటుందా అంటూ అప్పుడే కథలు అల్లేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన నిధి అగర్వాల్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ ప్రొడ్యూస్ చేయనున్నాడు.