ఎట్టకేలకు మాస్క్ లో దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ...

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత కే.

 Tollywood Rowdy Vijay Devarakonda React About Corona Mask Vijay Devarakonda, To-TeluguStop.com

ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించారు.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ గ్లామర్ రాశి కన్నా, కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్, బ్యూటీ క్వీన్ కేథరిన్, ఇంగ్లీష్ నటి ఇసబెల్లా హీరోయిన్లుగా నటించారు.అయితే భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది.

దీంతో అనుకోని విధంగా విజయ్ దేవరకొండ కెరీర్లో మరో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు.

అయితే ఏమైందో ఏమోగాని ఈ చిత్రం విడుదల అనంతరం విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వైపు చూడడమే మానేశాడు.

ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టాలీవుడ్ స్టార్లు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు గురించి అవగాహన కల్పిస్తూ ఉంటే విజయ్ దేవరకొండ మాత్రం సోషల్ మీడియాపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు.అయితే తాజాగా ఎట్టకేలకు విజయ్ దేవరకొండ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా వైరస్ గురించి పలు సలహాలు సూచనలు ట్వీట్ చేశాడు.

ఇందులో భాగంగా అందరూ సురక్షితంగా ఉన్నారని అనుకుంటున్నాను అంటూ కరోనా వైరస్ రాకుండా జేబు రుమాల, కండువా మరియు మీ అమ్మ ఉపయోగించేటటువంటి చున్నీని ఉపయోగించాలని సూచించాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు కీలక సన్నివేశాలు పూర్తయ్యాయి.

 అంతేగాక తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube