తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రీసెంట్ మూవీ దర్బార్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయడంతో భారీ రేటుకు బయ్యర్లు ఈ సినిమాను కొనుగోలు చేశారు.
కాగా రిలీజ్ తరువాత దర్బార్ చిత్రం కలెక్షన్లు కొల్లగొట్టడంలో ఫెయిల్ అయ్యింది.
ఫలితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రంగా మిగిలింది.ఇక బయ్యర్లు ఈ సినిమాతో భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో వారు తమకు న్యాయం చేయాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ను కోరారు.అయితే ఈ విషయంలో తామేమీ చేయలేమని లైకా ప్రొడక్షన్స్ తెలపడంతో బయ్యర్లు రజినీకాంత్‌ను తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.
అయితే ఎంతకీ వారికి న్యాయం జరగకపోవడంతో వారు నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు.దీంతో చిత్ర దర్శకడు ఏఆర్ మురుగదాస్ తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో చెన్నైలోని మురుగదాస్ ఆఫీస్, ఇంటికి పోలీసులు సెక్యురిటీని ఏర్పాటు చేశారు.మరి ఈ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.