చదువుకుని తల్లిదండ్రుల కలను మరిచి సెల్ఫీ మోజులో పడి వారి కలలను చిన్నాభిన్నం చేసింది. తాజాగా ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకోవడం కోసం ఓ రైలు వంతెన పైకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటన బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే బెంగాల్ నగరంలో మైనాగురికి చెందిన ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ లో ఇద్దరు యువతులు చదువుకుంటున్నారు.అయితే తాజాగా ఈ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి విద్యార్థినీ,విద్యార్థులు కలిసి సరదాగా గడపడం కోసం ఘిస్ నది తీరానికి వెళ్లారు.
అయితే ఇందులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకోవడం కోసం పక్కనే ఉన్నటువంటి రైలు వంతెనపైకి వెళ్లారు.అయితే ఈ సెల్ఫీ తీసుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న రైలుని గమనించకపోవడంతో ఓ యువతిని రైలు డీ కొట్టింది.
దీంతో ఆ యువతి అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అయితే మరో యువతి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైలు వంతెనపై నుంచి నదిలోకి దూకేసింది.అయితే నదిలోకి దూకినటువంటి ఈ యువతిని చేసినటువంటి చుట్టూ ప్రక్కల వారు ఆమెను కాపాడి చికిత్స నిమిత్తమై దగ్గర్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్చి పోలీసులకి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.