ప్రాణం తీసిన సెల్ఫీ ఎలాగంటే...?

చదువుకుని తల్లిదండ్రుల కలను మరిచి సెల్ఫీ మోజులో పడి వారి కలలను చిన్నాభిన్నం చేసింది.

 తాజాగా ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకోవడం కోసం ఓ రైలు వంతెన పైకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటన బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే బెంగాల్ నగరంలో మైనాగురికి చెందిన ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ లో ఇద్దరు యువతులు చదువుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి విద్యార్థినీ,విద్యార్థులు కలిసి సరదాగా గడపడం కోసం ఘిస్ నది తీరానికి వెళ్లారు.

అయితే ఇందులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకోవడం కోసం పక్కనే ఉన్నటువంటి రైలు వంతెనపైకి వెళ్లారు.

అయితే ఈ సెల్ఫీ తీసుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న రైలుని గమనించకపోవడంతో ఓ యువతిని రైలు డీ కొట్టింది.

దీంతో ఆ యువతి అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయింది. """/"/ అయితే మరో యువతి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైలు వంతెనపై నుంచి నదిలోకి దూకేసింది.

అయితే నదిలోకి దూకినటువంటి ఈ యువతిని చేసినటువంటి చుట్టూ ప్రక్కల వారు ఆమెను కాపాడి చికిత్స నిమిత్తమై దగ్గర్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్చి పోలీసులకి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Hero Naveen Polishetty : రోడ్డుప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు..!