ఇటీవల సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పమయంలో నలుగురు నిందితులు పారిపోయే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో వారిని ఎన్కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది.
దిశ హత్య కేసు నిందితులను పోలీసులు వారం రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే .ఈ రోజు పొద్దునే నిందితులను విచారణ కోసము సంఘటన స్థలాన్ని తీసుకొని వెళ్లగా ,నింధితులు నలుగురు పారిపోతుంటే పోలీస్ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది,కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తుంది.
ఎన్కౌంటర్ జరిగినట్లు సీపీ సజ్జనార్ నిర్ధారించారు.ఈ తెల్లవారుజామున మూడు,ఆరుగంటల మధ్యలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిపారు .ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశములో ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఎన్కౌంటర్ పై అందరూ దిశకి నిజమైన న్యాయము జరిగింది అన్ని చెపుతున్నారు.తెలంగాణ పోలీస్ ల పై ప్రశంసలుతో ప్రజలు జై తెలంగాణ పోలీస్ అంటూ సంఘటన స్థలములో నినాదాలతో హోరెతించారు.
తాజా వార్తలు