సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వాడని వారు ఇప్పుడు అరుదుగా ఉంటారు.స్మార్ట్ ఫోన్ ఉన్నవారంతా ఈ ఫేస్‌బుక్ కి బానిసలుగా మారిపోయారు.
ఏ చిన్న విషయం అయినా … పెద్ద విషయం అయినా … ఫేస్ బుక్ లో పెట్టడం ఇప్పుడు అందరికీ అలవాటు అయిపొయింది.అయితే యూజర్ల నమ్మకాన్ని ఫేస్ బుక్ క్యాష్ చేసుకోవాలనుకుంది అనే నిజం ఇప్పుడు బయటపడడంతో అంతా షాక్ కి గురవుతున్నారు.

యూజర్ల డేటాను కంపెనీలకు విక్రయించే ఆలోచనను ఫేస్‌బుక్ కొంతకాలం క్రితమే చేసిందని, కానీ తర్వాత అందుకు వ్యతిరేకంగా వ్యవహరించాలని నిర్ణయించిందనే వార్తలు ఇప్పుడు బయటపడింది.యూజర్ డేటా ‘ది గ్రాఫ్ ఎపిఐ’ అందుబాటులోకి వచ్చే సౌలభ్యం కల్పించాలంటే కనీసం 250,000 డాలర్లు కంపెనీలు చెల్లించాలని 2012లో ఫేస్‌బుక్ సిబ్బంది నిర్ణయించినట్లు కొన్ని కథనాలు బయటపడ్డాయి.అయితే 2014 ఏప్రిల్‌లో ఫేస్‌బుక్ ఆ పద్ధతిని మార్చింది.2015 జూన్ నాటికల్లా మొత్తంగా డేటా అందుబాటులోకి వచ్చే సౌకర్యాన్ని తొలగించింది.

యూజర్ సమాచారం అందే సౌలభ్యాన్ని పెంచితే అందుకు ప్రతిగా మరింత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అన్న ఆలోచనపై ఫేస్‌బుక్ ఉద్యోగులు కొందరు ఆనాడు చర్చించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది.ఈ సమాచారం సేకరించడానికి ఫేస్‌బుక్ అనేక పద్ధతులను ఉపయోగించింది.యూజర్ల లోకేషన్లు కనుగొనడం, వారి సందేశాలను చదవడం, ఫోన్లలో వారి ఫోటోలను అందుబాటులోకి తెచ్చుకోవడం వంటి చర్యలకు పాల్పడిందని గార్డియన్ పేర్కొంది.వ్యక్తుల కాల్స్, సందేశాలు ద్వారా తాము సమాచారాన్ని సేకరించామని మార్చిలో ఫేస్‌బుక్ అంగీకరించింది.
అయితే వీటన్నింటికీ ముందుగానే అనుమతి తీసుకున్నామని తెలిపింది.