చరణ్‌ చేయని సాయం, బన్నీ చేశాడు

ఎంత పెద్ద స్టార్‌ అయినా, నిర్మాత అయినా కొన్ని సార్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.అలాంటి సమయంలో తమ అనుకున్న వారు సాయం చేయాలి లేదంటే కనీసం అండగా అయినా నిలబడాలి.

 Nagababu About Ram Charan And Allu Arjun-TeluguStop.com

అలా సాయం చేసిన వారే అసలైన ఆప్తులు.నాగబాబు నిర్మాతగా ‘ఆరంజ్‌’ వల్ల ఎంతగా నష్టపోయాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ నష్టంను భర్తీ చేసేందుకు చిరంజీవి కుటుంబం ఏమాత్రం ముందుకు రాలేదు.అయితే పవన్‌ మాత్రం తనకు తోచిన సాయంను చేశాడని మొదటి నుండి చెబుతూ వస్తున్నారు.

ఇప్పుడిప్పుడే నాగబాబు మళ్లీ ఆర్థికంగా గాడిన పడ్డాడు.

తాజాగా అల్లు అర్జున్‌తో నాగబాబు ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.బాబాయి తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు చరణ్‌ తన డేట్లు ఇచ్చి ఉంటే ఆయన ఆర్థికంగా ఎప్పుడో మళ్లీ కుదుట పడేవారు.కాని చరణ్‌ మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు.

చిరంజీవి కూడా మరోప్రయత్నం చేయి అంటూ మద్దతుగా నిలిచింది లేదు.దాంతో నాగబాబు ఇన్నాళ్లు నిర్మాణంకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చాడు.

తాజాగా అల్లు అరవింద్‌ సూచన మేరకు, అల్లు అర్జున్‌ మద్దతుతో నిర్మాతగా సినిమా చేశాడు.బన్నీ డేట్లు ఇవ్వడంతో తెలివిగా లగడపాటి శ్రీధర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

పెద్దగా పెట్టుబడి లేకుండానే నాగబాబుకు ఈ చిత్రంతో ఏకంగా 25 కోట్లకు పైగా మిగిలినట్లుగా సమాచారం అందుతుంది.

నాగబాబు తాజాగా మాట్లాడుతూ.

నిర్మాణంపై ఆసక్తి లేని తనకు అల్లు అరవింద్‌ వెన్నుతట్టి ప్రోత్సాహం అందించాడు.అల్లు అర్జున్‌ స్వచ్చందంగా ముందుకు వచ్చి డేట్లు ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు.

వీరు ఇచ్చిన స్ఫూర్తి మరియు సహకారంతో ముందు ముందు కూడా సినిమాలు తీస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

నాగబాబును ప్రోత్సహిస్తూ సినిమా నిర్మాణంకు అల్లు అర్జున్‌ ఆహ్వానించడం వల్ల ప్రస్తుతం సినీ వర్గాల్లో అల్లు వారి ఫ్యామిలీ క్రేజ్‌ అమాంతం పెరిగింది.

మంచి మనసు చాటుకున్నారు అంటూ అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సమయంలోనే చరణ్‌ మరియు చిరుపై కాస్త విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా చరణ్‌ ఒక సినిమాను నాగబాబు కోసం చేస్తే బాగుంటుందని, నాగబాబును ఆర్థికంగా సెటిల్‌ చేసేందుకు మెగా ఫ్యామిలీ అంతా ముందుకు రావాలని మెగా ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

ఆరంజ్‌ దెబ్బకు దాదాపు 40 కోట్ల నష్టంను నాగబాబు చవి చూశాడు.

ఆ సమయంలో కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నాడనే టాక్‌ వచ్చింది.ఆ తర్వాత మెల్ల మెల్లగా ఇబ్బందుల నుండి తేరుకుని నాగబాబు మళ్లీ నిర్మాతగా తన ప్రస్థానంను మొదలు పెట్టాడు.

మెగా హీరోలతో పాటు ఇతర హీరోలతో కూడా సినిమాలు తీస్తాను అని, తన కొడుకుతో వెంటనే సినిమాలు చేసే ఆలోచన లేదు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube