రాయలసీమలో జగన్ కి చెక్ పెట్టబోతున్న బాబు ప్లాన్ ఇదే

జనసేన చూపు రాయలసీమ మీద పడింది.ఎందుకు అలా.

 Tdp,janaena Politics At Rayalaseema-TeluguStop.com

ఏమిటి కిటుకు.అనుకుంటే వైఎసార్ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడం కోసమేనట.

వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచీ పోటీ ఉంటుంది అని ప్రకటించిన పవన్ కళ్యాణ్.అడుగులు చకచకా వేస్తున్నారు.

ఇది చంద్రబాబు,పవన్ పక్కా స్కెచ్ అని విశ్లేషకుల భావన

గత ఎన్నికల్లో వైఎసార్ పార్టీకి రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చాయి.ఇప్పుడు అక్కడ జగన్ ప్రాభల్యం తగ్గిస్తే చంద్రబాబు గెలుపు తధ్యం.

కానీ చంద్రబాబు వల్ల జరిగే పని కాదు అందుకే పవన్ అస్త్రాన్ని అక్కడ ప్రయోగించనున్నారు.రాయలసీమ సమస్యలన్నీ తక్షణం పరిష్కరించేయాలని తాజాగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం, పవన్ చెప్పిన వెంటనే అదేదో అధిష్టానం ఆదేశంలా చంద్రబాబు హుటాహుటిన సమస్యల పరిష్కారం చేయడం.

ఇదంతా జనసేన,టీడీపి వ్యూహంలో భాగమే అన్నది విశ్లేషకుల భావన

ఇప్పటివరకు ఎన్నికైన ముఖ్యమంత్రులలో అందరు రాయలసీమ నుంచీ వచ్చిన వారే కావడం గమనార్హం.చిరంజీవి కూడా తన రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచీ ,పాలకొల్లు నుంచీ మొదలుపెట్టడానికి కారణం ఇదే.ఇప్పుడు తన తమ్ముడు జనసేన అధినేత పవనకళ్యాణ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు.రాయలసీమలో పవన్ కళ్యాణ్ తో సమస్యల మీద స్పందించేలా చేయడం.

సమస్యలని పరిష్కరించడం తద్వారా అక్కడి ప్రజల్లో పవన్ మీద అంచనాలని పెంచేలా చేయడం.దానికి తోడు ఇప్పుడు ఎలాగో పవన్ కి రాయలసీమ యువకులలో మాంచి ఫాలోయింగ్ ఉంది.

ఒక హీరోగా క్రేజ్ కూడా బాగానే ఉపయోగపడుతుంది.అదేవిధంగా చంద్రబాబు జలసిరి పేరుతో సీమకి నీళ్ళని తీసుకురావడం.

తెలుగు దేశానికీ ,జనసేన పార్టీకి కలిసొచ్చే అంశాలు.మరి చంద్రబాబు,పవన్ వేసే స్కెచ్ సక్సెస్ అవుతుందా.

జగన్ మోహన్ రెడ్డి కి ఉన్న బలమైన ఓటు బ్యాంక్ కొల్లగొట్టగలరా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube