మహారాష్ట్ర సీఎం పదవి మళ్లీ దేవేంద్రుడికేనా?

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.

 Will Devendra Fadnavis Become Maharashtra Cm Again?.. Maharashtra, Maharashtra P-TeluguStop.com

వీరంతా శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో గౌహతిలో ఉన్నారు.మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నెమ్మదిగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే బీజేపీ నేత, మాజీ సీఏం దేవేంద్ర ఫడ్నవీస్, రెబల్ నేత ఏక్ నాథ్ షిండే రహస్యంగా సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలో త్వరలోనే మహారాష్ట్రలో బీజేపీ సర్కారు ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడటంతో గవర్నర్ బలపరీక్షకు ఆదేశించారు.గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది.

ఉద్ధవ్ థాక్రే వైపు బలం లేకపోవడంతో ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దీంతో బీజేపీ ఆధ్వర్యంలో కొత్త సర్కారు ఏర్పడనుంది.

కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.శివసేన రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.

Telugu Congress, Maharashtra, Modi, Shiv Sena-Telugu Political News

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడనున్న క్యాబినెట్‌లో 42 మంది మంత్రులు ఉంటారని తెలుస్తోంది.ఇందులో నుంచి శివసేన రెబల్స్‌కు 13 మంత్రి పదవులను బీజేపీ అధిష్టానం కేటాయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ మేరకు సిద్ధమైన జాబితాతో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.మొత్తానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగానే అయిపోయింది.రెండున్నరేళ్లు అధికారాన్ని చెలాయించిన ఈ మూడు పార్టీలు గద్దె దిగే ముహూర్తం ఆసన్నమవుతోంది.288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 144 మ్యాజిక్ ఫిగర్ అయితే.మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఇటీవల వరకు 152 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.అయితే ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో 40 పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు.

దీంతో 106 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube