ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ముఖ్యంగా వైసీపీ నేతలు అధికారం ఉందని రెచ్చిపోతున్నారు.
తమకు ఇష్టం వచ్చినట్లు టీడీపీ నేతలపై నోరుపారేసుకుంటున్నారు.విజయసాయిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుంటారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ఏకవచనంతో సంభోదిస్తుంటారు.అయితే కొన్నాళ్ల క్రితం వరకు సహనంతో, ఓపికతో అన్నీ భరించిన తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిపడేస్తున్నారు.
మాట్లాడితే కేసులు, కదిలితే అరెస్టులు చేస్తూ వైసీపీ ప్రభుత్వం భయపెడుతున్నా తాము బెదిరేది లేదంటూ టీడీపీ నేతలు అమీతుమీ తేల్చుకుంటున్నారు.ఈ విషయంలో చంద్రబాబు చెప్పినా వినేది లేదంటూ టీడీపీ నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు.
సాధారణంగా చంద్రబాబుది శాంత మనస్తత్వం.ఆయన ఏదైనా చేతలతోనే చూపిస్తుంటారు.
మాటలు తక్కువగా వాడుతుంటారు.కానీ వైసీపీ నేతల చేష్టల వల్ల, తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి వల్ల చంద్రబాబు కూడా ఈ మధ్య తన స్వరం పెంచుతున్నారు.
ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ నేతల విషయంలో ఈసారి బాబు చెప్పినా వినే ప్రసక్తి లేదని అనేశారు.

తన నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలలో చేసిన కామెంట్లు వేడి పుట్టిస్తున్నాయి.రేపటి రోజున అధికారంలోకి రాగానే వైసీపీ నేతల వీపులు పగలగొట్టడం ఖాయమ ని షాకింగ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.

బాబు గారు నో అన్నా ఊరుకునే ప్రసక్తే లేదని.అతి చేస్తున్న వైసీపీ లీడర్ల జాబితాను రెడీ చేస్తున్నామని.వారికి ఇక బడిత పూజే పూజ అంటూ ప్రత్తిపాటి పుల్లారావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని.పొత్తులు లేకుండానే తాము 160 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అటు మరో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా విజయసాయిరెడ్డితో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు.విజయసాయిరెడ్డి ఒరేయ్.
తాగుబోతు.లుచ్చా అనే పదాలు వాడుతున్నా అయ్యన్నపాత్రుడు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.