మిర్యాలగూడలో జరిగిన కులదురంహకార హత్య .పట్టపగలు అందరూ చూస్తుండగానే ప్రణయ్ ని దారుణంగా చంపిన విషయం తెలిసిందే.
ప్రణయ్ భార్య అమృతని కలవడానికి తమిళనాడు నుండి కౌసల్య అనే యువతి వచ్చింది.ఇంతకీ ఎవరీ కౌసల్య,ఆమెకి అమృతకి ఏం సంబంధం.
ప్రణయ్ మాదిరిగానే కౌసల్య భర్తను పొట్టన పెట్టుకున్నారు కౌసల్య తల్లిదండ్రులు.ఒక బంతిని బలంగా విసిరితే రెట్టింపు వేగంతో వెనక్కి తిరిగి వస్తుంది.
అదే విధంగా కౌసల్య కూడా తల్లిదండ్రులమీద న్యాయపోరాటానికి దిగింది.విజయం సాధించింది.
కులరక్కసిపై ఇంకా పోరాడుతుంది.
కౌసల్య.2016కి ముందు ఒక సాధారణ యువతి.13 మార్చి 2016 నాడు తమిళనాడు, తిరుపూర్‌జిల్లా ఉడుముల్‌పేట్ మార్కెట్‌లో కర్కష దాడికి గురయ్యింది.తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న దళిత యువకుడు శంకర్‌ని పట్టపగలు అందరు చూస్తుండగానే కిరాయి హంతకులు కిరాతకంగా చంపేశారు.దాడి చేయించింది ఎవరో కాదు కౌసల్య తల్లిదండ్రులే.
దాడిలో తన భర్త శంకర్ చనిపోగా, తను తీవ్రంగా గాయపడి ప్రాణంతో భయటపడింది.శంకర్ చావుకు కారణం ఒక్కటే అతడు ఒక దళిత యువకుడు.
కౌసల్య,శంకర్ ని పెళ్లి చేసుకుందనే కారణం చేతనే.ఆ శంకర్ నే లేపేస్తే పగ చల్లారుతుందని, భర్తని చంపేస్తే కౌసల్య తమ మాట వింటుంది అని భావించారు తల్లిదండ్రులు…కానీ భర్త మరణంతో కౌసల్య కృంగిపోలేదు.
భర్తను కోల్పోయిన కౌసల్య భయపడి వెనక్కి తగ్గలేదు.తన భర్తను చంపినవారికి తగిన శిక్ష కోసం పోరాటబాట పట్టింది….కానీ తను పోరాడుతున్నది తన భర్త హంతకుల పై మాత్రమే కాదు….తన తల్లిదండ్రుపైనే.తన భర్తని కిరాయి హంతకుతో చంపించింది తన తల్లిదండుల్రే.తన పోరాటాన్ని ముందుకే నడిపిన కౌసల్య తన తల్లిదండ్రులకు, హంతకులకు ఉరిశిక్ష వేయించింది.
హంతకులకు బెయిల్ ఇవ్వద్దంటూ , విజయం కోసం 58 సార్లు హైకోర్టు బోన్ ఎక్కింది.రెండేళ్ళ క్రిందటి వరకు ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఒక సగటు అమ్మాయి….
నేడు తమిళనాడులో ఒక ఉద్యమకెరటం.కౌసల్యని కలిసిన తర్వాత,తనతో మాట్లాడిన తర్వాత తాను కూడా కౌసల్య బాటలోనే కులరక్కసిపై పోరాటం చేస్తానని అంటున్నది అమృత.