జనసేనాని ప్రజా పోరాట యాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఏపీలో అత్యంత కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మారు యాత్రకి ముహూర్తం పెట్టారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుందట.ఈ విషయంపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలకి ఆదేశాలు పంపారు.
ఈ పర్యటనకి సంభందించి పార్టీలో కీలక ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది అయితే పర్యటన వివరాలు టూర్ షెడ్యుల్ అంతా ఎంతో గోప్యంగా సాగుతోంది.అయితే

జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయనున్న నేపధ్యంలో వివిధ అంశాలపై పవన్ దృష్టి పెట్టారని టాక్ వినిపిస్తోంది అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ గత కొంతకాలంగా చెప్పట్టారట కూడా అయితే విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ యాత్ర అంతా ఆద్యంతం చంద్రబాబు లోకేష్ లే టార్గెట్ గా సాగనుందని తెలుస్తోంది.అందుకు తగ్గట్టుగానే పవన్ ఇప్పటికే ప్రేపైర్ అయ్యారట.ఇదిలాఉంటే
పవన్ వారం రోజుల పాటు ఏలూరు కేంద్రంగా బస చేయనున్నారని తెలుస్తోంది.
అందుకు అనువైన భవనాన్ని కూడా సిద్ధం చేయాలని తెలిపారట.అయితే పవన్ చేయబోయే మలివిడత యాత్రలో ఏజెన్సీ ప్రాంతాలు అయిన పోలవరం బుట్టాయి గూడెం కూడా ఉండటంతో పాటు చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో కూడా యాత్ర ఉంటుందట పోలవరం విషయంలో బాబు పై తీవ్రంగా స్పందించనున్నారట పవన్

అంతేకాదు పవన్ ఉన్న ఈ వారం రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన టీం ని ఏర్పాటు చేసి మరీ వెళ్ళనున్నారట.కమిటీలో ఎవరెవరికి స్థానం కల్పించాలి.సామాజిక వర్గాల సమీకరణాలు, మహిళలు యువకులకు ఇవ్వాల్సిన పాత్ర వంటి అన్ని అంశాలపై ఇప్పటికే జిల్లాలోని ముఖ్య నేతలంతా చర్చించుకుని ఒక జాబితాను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి పంపారట.
సో పవన్ యాత్ర మాత్రం ఎంతో వాడి వేడిగా జరనుందని టాక్ వినిపిస్తోంది.
.