సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రశాంత్ నీల్( Prashanth Neel ) అద్భుతాలను క్రియేట్ చేస్తున్నాడు.ఇప్పటికే సలార్ సినిమా( Salaar )తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో తను తాను మరోసారి రిప్రజెంట్ చేసుకున్నాడు.
ఇక ఇలాంటి సమయంలో ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన మేకింగ్ అనే చాలా మంది చెప్తూ ఉంటారు.ఇక ఆయన సినిమాలు ఎప్పుడు దుమ్ము, ధూళి మసిపట్టిన క్యారెక్టర్లతోనే ఉంటాయి.
కాబట్టి ఆయన ఒక ప్యూర్ లవ్ స్టోరీ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో దాని గురించి చాలా తీవ్రమైన చర్చ అయితే నడుస్తుంది.కొంతమంది ప్రశాంత్ నీల్ అలాంటి ఒక సినిమా చేస్తే ఆ సినిమాలో కూడా హీరో హీరోయిన్ మాసపోసుకుని ఉంటారు అందులో ఉండే రొమాంటిక్ సీన్స్ కూడా బొగ్గు గనుల్లోనే ఉంటాయని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే ఎన్టీఆర్( JR ntr ) హీరోగా ఒక సినిమాని అయితే చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాపైతే ఉన్నాయి.
తెలుగు హీరోలతోని సినిమాలు చేయడం పట్ల కన్నడ అభిమానులు కొంతవరకు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ కన్నడలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోలు యశ్ ( Yash )ఒక్కడు తప్ప ఇంక వేరే హీరోలు లేకపోవడం తో ఆయన తెలుగు హీరోల బాటపట్టినట్టుగా ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు… ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…చూడాలి మరి ఆయన ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది…
.