వైట్ హౌస్ ముందు భారత టెకీల నిరసన..!!!

అమెరికాలో చట్టపరంగా ఉంటున్న హెచ్ -1 బీ బీసాదారులకి ప్రయోజనం చేకూరేలా ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు తీసుకురావాలని భారత ఎన్నారైలు ఆదివారం వైట్ హౌస్ ముందు ధర్నా నిర్వహించారు.

 We Are Not Displacing American Jobs-TeluguStop.com

రిపబ్లిక్ హిందూ కొలిషన్(ఆర్‌హెచ్‌సీ) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

ఈ ధర్నాలో దాదాపు 300 మంది భారతీయులు పాల్గొని తమ నిరసనని ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శించారు.

తమ వల్ల అమెరికన్స్ ఉద్యోగాలకి ముప్పు ఉందని అనడం తగదని అన్నారు.అంతేకాదు టెకీలు ముఖ్యంగా మూడు అంశాలని ప్రధానంగా లేవనెత్తారు.

గ్రీన్ కార్డు పొందడానికి విదేశీయులకు శతాబ్దాలు పడుతోంది అలాకాకుండా హెచ్ 1-బీ వీసాదారులు వీసా కోసం దరఖాస్తు పెట్టుకున్న ఒకటి నుంచి ఐదేళ్లలోగా వీసా వచ్చేలా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా గ్రీన్‌కార్డుల జారీలో విధిస్తున్న కంట్రీ క్యాప్‌లో చట్టపరమైన సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube