ఈ 'యాత్ర' వైసీపీకి కలిసొచ్చినట్టేనా ....?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు ఏపీలో ఒకరకమైన ఊపు కనిపించింది.ఆ ఊపు తో ఈ ఎన్నికల్లో గట్టెక్కేయడం ఖాయం అనుకుంటుండగానే… అనూహ్యంగా టీడీపీ సంక్షేమ పధకాలను ప్రకటించి మైలేజ్ పెంచేసుకుంది.

 Yatra Movie Will Give Mileage To Ys Jagan-TeluguStop.com

దీంతో ఏ రకంగా తమ పార్టీ మైలేజ్ పెంచోకోవాలి అనే విషయంలో వైసీపీ గందరగోళంలో పడింది.ఇది ఇలా ఉండగానే… వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ పేరుతో బయటకి వచ్చేసింది.

ఈ ‘యాత్ర’ ఎవరూ ఊహించని విధంగా ప్రజల్లోకి వెళ్లడం… మరోసారి రాజశేఖర రెడ్డి ని ప్రజలు గుర్తు తెచ్చుకోవడం వైసీపీకి అమాంతం మైలేజ్ పెరిగిందనే చెప్పాలి.వాస్తవంగా ముందు నుంచి ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు అయితే లేదు.

ఈ సినిమా కూడా లో బడ్జెట్ తోనే వచ్చింది.

ముందు నుంచి ….వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో తప్ప ఈ సినిమా విడుదలయ్యే వరకు బయట ప్రజలకు కూడా పెద్దగా తెలియలేదు.కేవలం, ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన సినిమాగా మాత్రమే అందరూ ఊహించుకున్నారు.

అదీ కాకుండా… ఇంతకు ముందే ఎన్టీఆర్ బయోపిక్ బయటకి రావడం… అది కాస్తా ప్రజల్లో ఆశించిన స్థాయిలో వెళ్ళకపోవడం … వెంటనే ఈ ‘యాత్ర’ బయటకి రావడం… సక్సెస్ అవ్వడం ఇవన్నీ వైసీపీకి అదనంగా కలిసొచ్చిన బోనస్ గా భావిస్తున్నారు.అది కూడా ఎన్నికల ముందు ఈ విధంగా కలిసి రావడం, అందులో సీన్లు కళ్లు చెమర్చేలా ఉండడంతో ప్రజల్లో వైసీపీ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ కలిగించింది.

ఖచ్చితంగా చెప్పాలంటయే ఈ యాత్ర వైసీపీకి బాగా కలిసి రాబోతున్న అంశంగానే కనిపిస్తోంది.

‘యాత్ర’ సినిమాను కేవలం వైఎస్ అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఆదరిస్తున్నారు.సినిమాలో వైఎస్సార్ ను కళ్లకు కట్టినట్లుగా చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా, వైఎస్ ముఖ్యమంత్రిగా కావడానికి ముందు ఉన్న సమస్యలు, పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.

అంటే, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి పాలనను గుర్తు చేశారు.వైఎస్ ప్రారంభించి నేటికీ అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను, వాటి ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు ఈ సినిమా ద్వారా గుర్తు చేశారు.

ఇక, వైఎస్ మరణించిన సన్నివేశాలను వాస్తవానికి దగ్గరగా ఉండేట్టుగా విజువల్స్ చూపించడం ద్వారా ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఈ సినిమాలో ఎక్కడా వివాదాలు లేవు.వచ్చే ఎన్నికల్లో కీలకమైన చంద్రబాబు, జగన్ గురించి సినిమాలో ఏమీ చూపించలేదు.దీంతో… వైసీపీ నియోజకవర్గ ఇంచార్జిలు థియేటర్లలో షోలు మొత్తం బుక్ చేసి మరీ తమ కార్యకర్తలకు చూపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube