Vijay Devarakonda : రామ్ చరణ్ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ.. ఈ రౌడీ హీరో మామూలోడు కాదంటూ?

స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన రికార్డ్ లను సొంతం చేసుకున్నారు.రెండో సినిమా మగధీరతోనే బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ ను సాధించి చరణ్ చరిత్ర తిరగరాశారు.

 Vijay Devarakonda Breaks Ram Charan Instagram Followers Record Details-TeluguStop.com

మగధీర మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలై ఉంటే అప్పట్లోనే ఈ సినిమా సులువుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించి ఉండేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

అయితే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తాజాగా రామ్ చరణ్ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేసి వార్తల్లో నిలిచారు.

ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల( Instagram Followers ) విషయంలో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్ ను సృష్టించారు.విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 21 మిలియన్లుగా ఉంది.

ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఈ రౌడీ హీరో మామూలోడు కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.రామ్ చరణ్ తాజాగా 20 మిలియన్ మార్క్ ను ఇన్ స్టాగ్రామ్ లో చేరుకోగా అలవోకగా విజయ్ దేవరకొండ ఆ రికార్డ్ ను బ్రేక్ చేశారు.

విజయ్ దేవరకొండ గత సినిమా ఖుషి( Khusi Movie ) పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కొన్ని ఏరియాలలో ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.అయితే ఫ్యామిలీ స్టార్( Family Star Movie ) మాత్రం సెలవులు ఎక్కువగా ఉన్న సమయంలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.విజయ్ దేవరకొండ పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉంది.

బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచారు.ఐరనే వంచాలా ఏంటి డైలాగ్ ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పరశురామ్ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకుంటానని నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube