అర్ధం లేని ఆశకు అనవసరంగా బలైన యువకుడు.. !

సమాజంలో నేటికాలం పిల్లలకు కావలసిన సౌకర్యాలతో పాటుగా, పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి చదువులు చెప్పించడం, ఏది కావాలన్న క్షణాల్లో అమర్చడం ప్రెస్టేజీగా భావిస్తున్నారు తల్లిదండ్రులు.కానీ వారికి ఎలా బ్రతకాలో నేర్పడం లేదు.

 Unnecessarily Strong Yound Man Died For Meaningless Hope In Visakha,  Vishaka, Y-TeluguStop.com

మానసిక ధైర్యాన్ని నేటి కాలం చదువులు అందించడం లేదు.ర్యాంకులు అంటూ కాలంతో పోటీపడి కాస్త ఓటమి కలగగానే కృంగిపోతున్నారు.

కోరుకున్నది అందక పోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఓ యువకుడు కూడా అర్ధం లేని ఆశకు అనవసరంగా బలైన ఘటన విశాఖలో చోటు చేసుకుంది.

ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుకుంటున్న వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన షణ్ముక వంశీ (16) అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఓ కుక్కపిల్లను చూసి అది కావాలని అడిగాడట.దాని విలువ రూ.30వేలు కావడంతో ఆ తల్లి కొన్ని రోజుల తర్వాత కొందామని చెప్పడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడట.తల్లిదండ్రులు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి.

పిల్లలకు ఎలా బ్రతకాలో నేర్పితే వారే సంపాదించుకుంటారు.అది మరచి మానసిక స్దైర్యాన్ని ఇవ్వలేని చదువులను కొంటే ముందు తరాల భవిష్యత్తులు ఇలాగే కొనసాగుతాయని అంటున్నారట మేధావులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube