జులై పై కూడా మన వాళ్లకు నమ్మకం లేదా?

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇప్పటికే మూడు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి.

జూన్ చివరి వరకు థియేటర్లు పునః ప్రారంభం అవుతాయని ప్రేక్షకులు ఆశ పడుతున్నారు.

థియేటర్లు పునః ప్రారంభం అయితే మళ్లీ బిజీ బిజీగా షో సినిమా లు విడుదల అవ్వడం ఖాయం అనుకుంటే ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం నత్త నడకన ప్రయాణం సాగిస్తున్నారు.అంటే సినిమా లు జులై లో కూడా విడుదల చేయాలా వద్దా అన్నట్లుగా మిమాశలో ఉన్నారు.

ప్రస్తుతం సినిమా లు ఏమీ కూడా విడుదల కు సంబంధించిన హడావుడి లేవు.చాలా సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా జులై లో ఏ ఒక్క సినిమా విడుదల తేదీ రాలేదు.

ఒకటి రెండు సినిమా ల విడుదల తేదీలు చెబుతున్నా కూడా వచ్చే ఆగస్టు లోనే అంటున్నారు.అంటే మొత్తంగా జులై నాటికి సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అయిన సినిమా లు కూడా విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement

ఆగస్టు లో వరుసగా సినిమాలు వస్తాయని.జులై లో థియేటర్లు పునః ప్రారంభం అయినా కూడా ప్రేక్షకులు మాత్రం ఆ సినిమా లను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయం క్లారిటీ లేదు.

జులై లో సినిమా లను విడుదల చేసేందుకు తమిళ మరియు హిందీ ఫిల్మ్‌ మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు.కాని ఇప్పటి వరకు తెలుగు సినిమా మేకర్స్ మాత్రం రావడం లేదు.

ఇప్పటికే ఉత్తరాదిన ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలించడంతో పాటు థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి.కనుక కొత్త సినిమాలు విడుదలకు అనుకూలంగా పరిస్థితి ఉంది.

కాని తెలుగులో మాత్రం జులై లో థియేటర్లు పునః ప్రారంభంకు సంబంధించి ఎలాంటి అప్ డేట్‌ లేదు.కనుక జులై లో మన వారు ఎవరు కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చు అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు