ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కలిశారు.మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన సింబల్స్ ను తొలగించాలని ఈసికి ఫిర్యాదు చేశారు.
ఈసీ విధానానికి విరుద్ధంగా గుర్తులు కేటాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు.మరోవైపు మునుగోడులో గుర్తులు కేటాయింపులను ఈసీ అధికారులు పూర్తి చేసామని ప్రకటించారు.47 మందికి గుర్తులు కేటాయిస్తూ ఈసీ జాబితాను వెల్లడించారు.