అయ్యో ! ఈ టాప్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?   Trisha Oil Paint Photo Vairal She Is Acting Indira Gandi Bayopic     2018-10-25   22:02:48  IST  Sai M

తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన అందాల తార టాప్ హీరోయిన్ త్రిష … ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది అయితే ఆమె తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయెపిక్‌లో నటించబోతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. కానీ ఈ విషయమై త్రిష ఇంతవరకు స్పందించనే లేదు. తాజాగా త్రిష ఆయిల్‌ పెంట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

తమిళ మాగజైన్‌లో త్రిష ఆయిల్‌ పెంట్‌ను ప్రచురించారు. అయితే త్రిష మాజీ పీఎం ఇందిరాగాంధీ లుక్‌లో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. పొట్టి జుట్టు, ఆ చీరకట్టు, ఆ స్టిల్‌ను చూస్తుంటే ఒకసారి ఈమె త్రిషనా లేక ఇందిరా నా అనే సందేహం వచ్చేంతగా ఇందిరమ్మ లుక్‌లో అదిరిపోయింది. ఇందిరమ్మ లుక్‌లో త్రిషను చూసి ఈమె త్వరలో ఇందిరాగాంధీ బయోపిక్‌లో నటించబోతుంది అనే వార్తలు ఊపందుకున్నాయి