వాక్ స్వాతంత్య్రమంటే .. వేర్పాటువాదానికి మద్ధతిచ్చే స్వేచ్ఛ కాదు : కెనడాకు జైశంకర్ చురకలు

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అనుమానితులుగా ఆరోపిస్తూ ముగ్గురు భారతీయులను కెనడా అరెస్ట్ చేయడంతో మరోసారి ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( Minister Dr S Jaishankar ) స్పందించారు.

 Mea S Jaishankar Slams Canada, Says Freedom Of Speech Does Not Mean Freedom To S-TeluguStop.com

ఖలిస్తానీ వేర్పాటువాద అంశాలకు పొలిటికల్ స్పేస్ ఇవ్వడం ద్వారా కెనడా ప్రభుత్వం తమ ఓటు బ్యాంక్.చట్టబద్ధమైన పాలన కంటే శక్తివంతమైనదనే సందేశాన్ని పంపుతోందన్నారు.

Telugu Canada, Karan Brar, Khalistan, Mea Jaishankar, Meajaishankar, Freedomspee

జాతీయ వార్తాసంస్థ పీటీఐకి ( PTI )ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ.భారతదేశం వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుంది, ఆచరిస్తుందన్నారు.అయితే అది విదేశీ దౌత్యవేత్తలను బెదిరించే స్వేచ్ఛతో సమానం కాదని.వేర్పాటువాదానికి, హింసను సమర్ధించే అంశాలకు పొలిటికల్ స్పేస్‌ను అనుమతించదన్నారు.పంజాబ్ నుంచి వలస వెళ్లిన సిక్కులలో ఖలిస్తానీ( Khalistan ) మద్ధతుదారులను ప్రస్తావిస్తూ.అనుమానాస్పద నేపథ్యాలు కలిగిన వ్యక్తులు కెనడాలో ప్రవేశించడానికి , నివసించడానికి ఎలా అనుమతిస్తున్నారని జైశంకర్ ప్రశ్నించారు.

నియమబద్ధంగా నడిచే సమాజంలో వ్యక్తుల నేపథ్యం, వారు ఎలా ప్రవేశించారు, ఏ పాస్‌పోర్టులను తీసుకెళ్లారు తదితర అంశాలను తనిఖీ చేస్తారని మంత్రి అన్నారు.

Telugu Canada, Karan Brar, Khalistan, Mea Jaishankar, Meajaishankar, Freedomspee

కాగా.కెనడాలో దాదాపు 1.8 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు వున్నట్లు అంచనా.దీనికి తోడు దేశంలో మరో 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.ఇండియన్ డయాస్పోరాలో ఎక్కువగా సిక్కు కమ్యూనిటీకి చెందినవారే.వీరు కెనడా రాజకీయాలలో ప్రభావంతమైన సమూహంగా పరిగణించబడుతున్నారు.ఇకపోతే.

నిజ్జర్ హత్య కేసులో కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌లను అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్‌ సిటీలో అరెస్ట్ చేశారు.ఆర్‌సీఎంపీ (సర్రే)కి చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) , ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ సాయంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube