ఇటీవల గుండెపోటు మరణాలు( Heart Attack ) పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది గుండెపోటు కారణంగా మరణించిన వారు ఉన్నారు.
కరోనా తర్వాత మనిషి ఆరోగ్యంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఈ క్రమంలో గుండెపోటు మరణాలు పెరిగిపోవడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ మలయాళీ డైరెక్టర్ సిద్దిఖీ( Director Siddique ) గుండెపోటుతో మరణించడం జరిగింది.నిన్న గుండెపోటుకు గురైన ఆయనను.
కుటుంబ సభ్యులు కొచ్చి ఆసుపత్రికి తరలించడం జరిగింది.ఆ ఆసుపత్రిలోనే ఐసీయూలో నిన్నటి నుండి చికిత్స అందిస్తూ ఉన్నారు.
నిన్నటి నుండి చావుతో పోరాడిన ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో సిద్దిఖీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 1989లో “రామ్ జీ రావు స్పీకింగ్ “ అనే మలయాళ చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి….గాడ్ ఫాదర్, హిట్లర్, బిగ్ బ్రదర్, ఫ్రెండ్స్, కాబులీవాలా వంటి విజయవంతమైన సినిమాలు చేసిన సిద్దిఖీ హిందీలో సల్మాన్ ఖాన్ తో “బాడీగార్డ్” సినిమా( Bodyguard Movie ) చేయడం జరిగింది.
మోహన్ లాల్ తో తీసిన “బిగ్ బ్రదర్” మూవీ( Big Brother Movie ) తెలుగులో కూడా డబ్ అయింది.మలయాళం, హిందీ ఇంకా తమిళ్, తెలుగు, భాషల్లో కూడా సిద్దిఖీ సినిమాలు చేయడం జరిగింది.
ఈ క్రమంలో సిద్దిఖీ మరణించడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు.నివాళులర్పిస్తున్నారు.