Tiny circuits smallest TVs : ప్రపంచంలోనే అతిచిన్న టీవీలు లాంచ్.. ఓ లుక్కేయండి!

ఈరోజుల్లో ఏది లేకపోయినా టెలివిజన్ లేకుండా జనాలు ఉండలేకపోతున్నారు.రొటీన్ వర్క్స్ నుంచి కాస్త వినోదం అందించే ఈ టీవీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

 Tiny Circuits Launch Of The World's Smallest Tvs Tiny Tv, World's Smallest Tvs,-TeluguStop.com

అయితే కాలంతో పాటు టెలివిజన్ రూపురేఖలు కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి.ఇంతకుముందు, టీవీ స్క్రీన్ చిన్నగా ఉండి, దాని వెనక భాగం చాలా లావుగా, పెద్దగా ఉండేది.

అలాగే బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో మాత్రమే బొమ్మలు కనిపించేవి.కానీ ఇప్పుడు సన్నగా కలర్‌ఫుల్ డిస్‌ప్లేతో ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు వస్తున్నాయి.

అయితే ప్రపంచంలోనే అతి చిన్న టీవీ సెట్లను ఇప్పుడు ఒక కంపెనీ తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.ఇటీవల, టైనీ సర్క్యూట్స్ అనే హార్డ్‌వేర్ కంపెనీ ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ టీవీ రూపొందించింది.

ఇది ప్రపంచంలోనే అతి చిన్న టీవీ సెట్‌గా రికార్డు సృష్టించింది.సాధారణంగా, ప్రజలు పెద్ద టీవీని ఇష్టపడతారు, కానీ సాధారణ టెలివిజన్ కంటే కొంచెం భిన్నంగా కనిపించే ఈ టెలివిజన్‌కి నెలకొన్న డిమాండ్ ఏం తక్కువ కాదు.

కంపెనీ టైనీ టీవీ 2, టైనీ టీవీ మినీ అనే రెండు టీవీ సెట్లను తయారు చేసింది.

Telugu Tech, Tiny Circuits, Tiny Tv, Worldssmallest-Latest News - Telugu

చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయడంలో టైనీ సర్క్యూట్స్ ప్రసిద్ధి చెందాయి.ఇప్పుడు రెండు మినీ టీవీలను విడుదల చేసింది.ఈ మినీ టీవీలు, పోస్టల్ స్టాంపుల పరిమాణంలో ఉంటాయి.

అంటే ఎంత చిన్నగా ఉంటే అర్థం చేసుకోవచ్చు.ఇవి పాత టీవీ మోడల్స్‌గా కనిపిస్తూ సాధారణ టీవీ లాగానే పని చేస్తాయి.

నాబ్‌లు, రిమోట్ కంట్రోల్‌తో పాటు ఛానెల్, వాల్యూమ్‌ను సర్దుబాటు చేసే 8 జీబీ స్టోరేజ్ వీటిలో ఉంటుంది.కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా వీడియోను కూడా అప్‌లోడ్ చేయవచ్చు.2 గంటల పాటు వీడియోలను ప్లే చేయడానికి సరిపోయే బ్యాటరీతో ఈ టీవీ రన్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube