తెలుగుదేశం,జనసేన పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి చెప్పారు.పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 10 వార్డు గుర్రాలచవిడి గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి విడదల రజిని తోపాటు బైరెడ్డి సిద్దార్దరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకుంనేందుకు టీడీపీ, జనసేన పార్టీలు ఏమి జరగకపోయిన జరిగినట్లు గుండెలు బాదుకుంటు తిరుగుతారు.
చొక్కాలు చించుకుంటారు,మొసలి కన్నీళ్లు పెట్టుకుంటారు,కాళ్ళు పట్టుకుంటారు.ఏదోదో సమస్యలను సృష్టించి వాటితో లబ్ది పొందాలని ప్రతిపక్షా పార్టీలు చూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్రం అంత బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ లకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతున్నాయి,జగనన్న ప్రభుత్వం 1 లక్ష 80 వేల కోట్లా రూపాయలను సంక్షేమ పథకాలు అమలు చేశారు అని తెలిపారు.
సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పది కాలాలు పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ, ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే మరిన్ని సంక్షేమ పథకాలు ఉంటాయని,అభివృద్ధి చెందుతామని,2024 లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు తెలుపుతున్నారు అని వివరించారు.