ఓయబ్బో, ఈ మొసలి మామూలు ఎస్కేపిస్ట్ కాదు.. వ్యాన్ కిటికీ బద్దలుకొట్టి ఏం చేసిందో చూడండి!

సాధారణంగా బయట తిరుగుతున్న క్రూర జంతువులను అటవీ శాఖ అధికారులు పట్టుకొని వాహనంలోకి ఎక్కించుకొని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తారు.అలాగే జూ నిర్వాహకులు కూడా క్రూరమృగాలను తరచుగా శిక్షకుల సాయంతో కావలసిన ప్రాంతాలకు తరలిస్తుంటారు.

 This Crocodiley Escape From Van Windows Broken Crocodile, Attack, Latest Ne-TeluguStop.com

అయితే ఇలాంటి సమయాల్లో క్రూర మృగాలు తప్పించు కోవడానికి ప్రయత్నించి హడల్ పుట్టిస్తుంటాయి.తాజాగా ఫ్లోరిడాలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

ఒక మొసలిని పట్టుకొని తీసుకెళ్తుండగా అది వ్యాన్ కిటికీ బద్దలు కొట్టి కిందకు దూకేసింది.ఆ తర్వాత తప్పించు కోవడానికి అది ఉరుకులు పరుగులు తీసింది.

దీనికి సంబంధించిన వీడియోని సెయింట్ ఆగస్టీన్ ఎలిగేటర్ ఫార్మ్ జువాలాజికల్ పార్క్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

దీనికి ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో కర్సిన్ మెక్‌క్రీడీ, జన్ ఆండర్సన్ అనే కార్మికులు మొసలిని పట్టుకోవడానికి పరిగెత్తడం చూడొచ్చు.

ఎందుకంటే ఈ మొసలి ఓ కిటికీని పగులగొట్టి వ్యాన్ నుంచి చాక చక్యంగా తప్పించుకుంది.అయితే అదే జనావాసంలో, ప్రజలు తిరిగే చోట బయటికి దూకేసింది.

దీన్ని గమనించిన వైల్డ్ లైఫ్ వర్కర్లు షాక్ తిన్నారు.మహిళలు, ర్యాన్, డొనాల్డ్ అనే మరో ఇద్దరు వ్యక్తులు ఆ వర్కర్లకు మొసలిని పట్టించడంలో సహాయం చేశారు.

అదృష్టవ శాత్తూ ఈ మొసలి మళ్లీ తమచేతికి చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు వర్కర్లు.మొసలిని పట్టుకున్న తర్వాత దాన్ని సురక్షితంగా కొత్త ఆవాసానికి చేర్చామని వర్కర్లు తెలిపారు.

ఈ చిన్న వీడియోను జెస్సికా స్టార్ అనే ఒక వ్యక్తి రికార్డ్ చేశారు.ఆ వీడియోని సెయింట్ ఆగస్టీన్ పేజీ షేర్ చేసింది.“మేం మొసళ్లను జూలోని మరొక ప్రాంతానికి తరలిస్తున్నాం.వాటిని భద్రపరిచి మా జూ వ్యాన్‌లో ఉంచాం.

ఈ జంతువు వ్యాన్ వెనుక కిటికీని పగలగొట్టి రోడ్డు పైకి దూసుకెళ్లింది.దాన్ని తిరిగి పట్టు కోవడానికి చాలా కష్టపడ్డాం.

అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు’’ అని పోస్ట్‌ షేర్ చేసిన పేజీ ఓ క్యాప్షన్‌ను జోడించింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.“ఓయబ్బో, ఈ మొసలి మామూలు ఎస్కేపిస్ట్ కాదుగా! ఇంకా నయం ఇది యాడ్ చేయలేదు, థాంక్ గాడ్!” అని కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube