వామ్మో..25కోసం 25 రోజుల్లోనే కోర్టు కట్టేసారా?

సూర్య లాయర్ పాత్రలో జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జై భీమ్.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

 They Bulled A Court Jai Bhim Movie Within 25 Days, Jai Bhim, Movie, Surya, Court-TeluguStop.com

సుమారు 30 సంవత్సరాల క్రితం జరిగిన నిజజీవిత సంఘటనలను ఆధారంగా ఈ సినిమాను జ్ఞానవేల్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఇకపోతే ఈ సినిమాలో ఒక దళిత కుటుంబానికి చెందిన అమ్మాయికి జరిగిన అన్యాయం పై పోరాడుతూ తనకి ఏ విధంగా న్యాయం చేశారు అనే విషయం గురించి సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంది.ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ఎక్కువ భాగం కోర్టులో చిత్రీకరించాల్సి ఉండగా ఈ సినిమాకోసం అచ్చం చెన్నై హైకోర్టు సెట్ వేయాలని చిత్రబృందం భావించారు.అయితే చెన్నై హైకోర్టులో కి ఎవరికీ పర్మిషన్ ఉండదు.

కానీ జై భీమ్ చిత్ర బృందానికి కేవలం కోర్టు హాలుని చూడటానికి మాత్రమే అనుమతి లభించింది.

అలాగే హైకోర్టు జస్టిస్ చంద్రు వాదించిన కేసులకు సంబంధించిన పుస్తకాలలో కోర్టుకు సంబంధించిన కొన్ని ఫోటోలను దొరకడంతో వాటిని ఆధారంగా చేసుకుని హైకోర్టును తలపించేలా కేవలం 25 రోజులలోనే కోర్టును నిర్మించినట్లు చిత్రబృందం తెలిపారు.

ఇక ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత పలువురు న్యాయమూర్తులను తీసుకెళ్లి చూపించడంతో వారు ఎంతో ఆశ్చర్యపోతూ అచ్చం హైకోర్టులో ఉన్న భావన కలిగిందని తెలిపినట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube