రోజా.తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు.
జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా బాగా పాపులర్ అయ్యింది ఈ నటీమణి.తన బరువైన అందాలతో జనాలను ఎంతో కనువిందు చేస్తుంది.
కంటెస్టెంట్లను.వారు చేసే స్కిట్లను బాగా ఎంజాయ్ చేస్తూ షోకు మంచి ఊపు తెస్తుంది ఈ తారామణి.
ప్రస్తుత తరానికి జబర్దస్త్ కామెడీ షో జడ్జిగానే తెలుసు.కానీ తను ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన నటి.తెలుగు, తమిళ పరిశ్రమలను ఓ ఊపు ఊపిన హీరోయిన్.చూడ్డానికి నలుపు రంగు అయినా.
తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకునేది.తెలుగులోని టాప్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది.
సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది.నెమ్మదిగా సినిమాల నుంచి దూరమైన ఈమె ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యింది.
ఏపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమె.ప్రస్తుతం ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా కొనసాగుతుంది.ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొంటుంది.
ప్రస్తుతం సినిమాలకు ఆమె దూరంగా ఉంటుంది.
పలు సినిమా అవకాశాలు వచ్చినా.ఆయా కారణాలతో నో చెప్తుంది.
ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం హీరో లేదంటే హీరోయిన్ల తల్లి పాత్రలు చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది.
అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రోజా.ఇద్దరు హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని చెప్తుంది.
వారు మరెవరో కాదు.తను హీరోయిన్ గా ఉన్నప్పుడు కలిసి నటించిన హీరోలు చిరంజీవి, నాగార్జున.వీరి సినిమాల్లో ఛాన్స్ వస్తే.వదులుకునే ప్రసక్తే లేదని చెప్తోంది.
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రోజా.సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ము రేపాలని భావిస్తోంది.
ఇక తన వ్యక్తిగత జీవితానికి వస్తే.ప్రముఖ దర్శకుడు సెల్వమణిని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది.ఆయన తెరకెక్కించిన సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రోజా.తనతో ప్రేమలో పడి.పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్దరు పిల్లలున్నారు.