కడప జిల్లా కాశినాయన మండలంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) బస్సు యాత్రను ప్రారంభించారు.ఈ మేరకు అమగంపల్లిలో యాత్రను ప్రారంభించిన ఆమె వైసీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేకానంద రెడ్డి( Ys Vivekananda Reddy ) హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి( YS Avinash Reddy )కి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని ఆమె మండిపడ్డారు.హంతకులను కాపాడేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని ఆరోపించారు.అయితే హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదని,ధర్మం కోసం తాను కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు.ఈ నేపథ్యంలో ఎవరిని గెలిపించాలో ప్రజలే నిర్ణయించుకోవాలని వెల్లడించారు.