అవకాశం వస్తే రౌడీ స్టార్ సరసన నటిస్తా.. శ్రావణ భార్గవి!

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

 There Is Any Chance To Act With Vijay Devarakonda Shravana Bharghavi Details, S-TeluguStop.com

ఇక ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో ఉంది.

కేవలం సాధారణ అభిమానులే కాకుండా ఈయనకు సెలబ్రిటీలలో కూడా అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ శ్రావణ భార్గవి గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా అందరికీ సుపరిచితమే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రావణ భార్గవి తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈమెకు నెటిజన్ల నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.మీకు కనుక హీరోయిన్ గా అవకాశం వస్తే మీరు ఏ హీరో సరసన నటించాలని కోరుకుంటారని ప్రశ్నించారు.

Telugu Chance, Sai Pallavi, Hema Chandra, Tollywood-Movie

ఈ ప్రశ్న అడుగుతూనే సదరు నెటిజన్ మీ భర్త హేమచంద్ర అని మాత్రం సమాధానం చెప్పకండి అంటూ కండిషన్ కూడా పెట్టారు.ఇక ఈ ప్రశ్నకు శ్రావణ భార్గవి సమాధానం చెబుతూ తనకు హీరోయిన్ గా అవకాశం వస్తే తనకెంతో ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తానని అతనిని హీరోగా సెలెక్ట్ చేసుకుంటానని తెలిపారు.అదే విధంగా తనకు సాయిపల్లవి అంటే ఎంతో ఇష్టం అనే విషయాన్ని కూడా శ్రావణ భార్గవి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube