ఏడాది గా ఘోషిస్తున్న ఆత్మ.....బందించాలని రాజస్థాన్ నుంచి వచ్చారు!

ఆత్మలు,దెయ్యాలు,భూతాలూ అంటే ఎవరైనా నమ్ముతారా.ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటి అని కొట్టిపారేస్తారు.

 The Ghosting Spirit-TeluguStop.com

కానీ ఇప్పటికీ కూడా వీటిని నమ్మే మూర్ఖులు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈ ఉదంతం ఒక ఊదాహరణ గా చెప్పుకోవాలి.ఎప్పుడో ఐదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి ఆత్మ ఘోషిస్తుంది అంటూ దానిని బంధించి తీసుకువెళ్ళడానికి ఏకంగా రాజస్థాన్ నుంచి ఏపీ కి వచ్చింది ఒక బ్యాచ్.

వివరాల్లోకి వెళితే….రాజస్థాన్ కు చెందిన గోవర్ధన్ అనే వ్యక్తి భార్య పిల్లల తో కలిసి ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా అనంతపల్లి లో పానీ పూరి విక్రయించేవాడు.

అయితే 2014 డిసెంబర్ 20 న గోవర్ధన్ అనారోగ్యం కారణంగా మృతి చెందడం తో కుటుంబ సభ్యులు అతడి మృత దేహాన్ని ఏపీ నుంచి రాజస్థాన్ కు తీసుకువెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.అనంతరం ఆ కుటుంబం తిరిగి అనంతపల్లి నుంచి సొంత రాష్ట్రం అయిన రాజస్థాన్ కు వెళ్ళిపోయింది.

అయితే ఏడాది కాలంగా ఆత్మ రూపంలో గోవర్ధన్ రాజస్థాన్ లోని బంధువుల పై ఆవహిస్తున్నాడని, అతడి ఆత్మ అనంతపల్లి లోనే ఉండిపోయింది అని కావున రాజస్థాన్ కు తీసుకురావాలి అని కోరుతూ ఆత్మ ఘోషిస్తుందట.

అందుకే గోవర్ధన్ ఆత్మను సీసా లో బంధించడానికి రాజస్థాన్ నుంచి వారి కుల పెద్దల తో పాటు గోవర్ధన్ కుమారుడు రాజేష్ కూడా శనివారం అనంతపల్లి వచ్చి దీపంతో పూజలు నిర్వహించారు.

ఆ తరువాత అతడి ఆత్మ సీసా లో బంధించినట్లు ఏవో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.అయినా మంత్రాలకు చింతకాయలు రాలతాయా అన్న సామెత వినే ఉంటారు.

అయినా ఈ మూఢ నమ్మకాల తో ఉండేవారు ఎవరు ఏమి చెప్పినా వినిపించుకునే పరిస్థితులలో ఉండరు.అయినా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢ నమ్మకాల తో జనాలు జీవనాలు సాగిస్తుండడం ప్రమాదకరమే అని చెప్పుకోవాలి.

ఈ మూఢ నమ్మకాల తో నరబలుల ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube