పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.కానీ ఆ సినిమాలను మాత్రం పూర్తి చేయడం లేదు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో వరుస హిట్ లు కొట్టిన పవన్ ఆ తర్వాత మాత్రం మరో సినిమాను పూర్తి చేయలేక పోయాడు.ఆయన రాజకీయాలపై ఫోకస్ పెట్టడమే ముఖ్య కారణం అని అందరికి తెలిసిన విషయమే.
అయితే రాజకీయాలకు స్వల్పంగా బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమా షూటింగులలో పాల్గొంటున్నాడు.ఇటీవలే వీరమల్లు కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసినట్టు టాక్ బయటకు వచ్చింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.
కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మొదటిసారిగా పవన్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడం అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం వల్ల ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఒకరు భాగం కాబోతున్నట్టు సమాచారం.మరి ఆ స్టార్ నటుడు ఎవరంటే.
బాబీ డియోల్ అని తెలుస్తుంది.ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ని తీసుకున్నట్టు టాక్.
దీంతో క్రిష్ పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.