బీహార్‌లోని సివాన్‌కు చెందిన 19 ఏళ్ల ప్రజ్వల్ పాండే అనే యువకుడు భారత సంతతికి చెందిన బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ 30 మంది సభ్యుల కోర్ కమిటీ మెంబర్‌గా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మించిన జీరాడీ బ్లాక్‌లోని జమాపూర్ గ్రామంతో ప్రజ్వల్‌కు అనుబంధం వుంది.
ప్రజ్వల్ 2019లో యూకేలోని కన్జర్వేటివ్ పార్టీలో చేరాడు.ఆగస్ట్ 2022లో సునాక్ ప్రచార కమిటీలోకి ఆహ్వానించబడ్డాడు.
16 సంవత్సరాల వయసులో ఈ కుర్రాడు రికార్డు స్థాయి ఓట్లతో యూకే యూత్ పార్లమెంట్‌లో చేరడమే కాకుండా పార్లమెంట్‌లోనూ ప్రసంగించాడు.ప్రచార కమిటీలో కమ్యూనికేషన్స్, ఔట్రీచ్ విభాగంలో వున్నారు.
ప్రతిరోజూ సీనియర్ నాయకులు, సలహాదారులతో పనిచేశాడు.ప్రజ్వల్ తండ్రి రాజేశ్ యూకేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ… పాండే తన కుమారుడు ప్రధాని రిషి సునాక్ కోసం ప్రచారం చేస్తుండటం గర్వంగా వుందన్నారు.పన్నులు, ఆదాయం, విద్య, విదేశీ, రక్షణ విధానాలను ప్రజ్వల్ హైలైట్ చేశాడని రాజేశ్ పేర్కొన్నారు.
ఈ కుర్రాడు కింగ్ ఎడ్వర్డ్ VI గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నాడు.గణితం, ఆర్ధిక శాస్త్రంలో అతనికి నైపుణ్యంతో వుంది.

ఇకపోతే… అనూహ్య పరిణామాల మధ్య రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.లిజ్ ట్రస్ రాజీనామాతో మెజార్టీ ఎంపీల మద్ధతుతో ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు.ప్రధాని హోదాలో తొలి మంత్రి మండలి సమావేశానికి రిషి సునాక్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై కేబినెట్‌లో చర్చించినట్లుగా తెలుస్తోంది.దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది.అక్రమ వలసలను సంక్లిష్టమైన , సవాలుతో కూడిన సమస్యగా రిషి సునాక్ తన మంత్రివర్గ సహచరులతో వ్యాఖ్యానించినట్లుగా తన కథనంలో తెలిపింది